మీరజాలగలడా నాయానతి సత్యాపతి........................
ప్రేమతో పాటుగా పంతం పౌరుషం, తేజం, రాచగుణ౦ ప్రభూ, వినయం విలువలనీయరా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా
నిరంతరం ప్రయత్నముండగా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్నవరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటారా
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టనేని బిగియ బట్టవలయు
బట్టి విడుట కన్నా బారగ చచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ
మాట - చేత ఒకటవటమే నిజాయతీ.
నీ వ్యక్తిత్వం తో నువ్వు బ్రతుకు.
నిన్నిష్టపడే వాళ్ళు నీతో ఉంటారు.
లేనివాళ్ళు నీ నుంచి దూరంగా పోతారు
ప్రేమ అంటే ఇవ్వటమే కాని తీసుకోవటము కాదు.
ఎప్పుడు అయితే నీలో కేవలం తీసుకోవటము ప్రారంభం అయ్యిందో, అప్పుడు అవతలి వారికి నీ పట్ల ప్రేమ నశిస్తుంది. అప్పుడు కూడా బంధాలు ఉండవచు, కానీ అవి కృతజ్ఞత వలనో కర్తవ్యం వలనో ఏర్పడిన బంధాలు.
అవసరం వలనో అమాయకత్వం వలనో ఏర్పడిన ప్రేమ కొంత కాలానికి కర్తవ్యమై, మరి కొంత కాలానికి నిర్లిప్తతకి, విముఖత్వానికీ దారి తీస్తుంది. అది ప్రేమ కాదు మాయ.
We gain strenght, courage and confidence by each experience in which we really stop to look fear in the face... we must do that which we think we can not --- Eleanor రూసేవేల్ట్
తనను తాను తగ్గించు కొనువాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును
నిజంగా మనకంటూ ఏదైనా రాసిపెట్టి ఉంటే అది తప్పకుండ మనకు దక్కుతుందని గుర్తించండి. దాని కోసం ఎదురుచూపులు ఆందోళనలు అనవసరం. ధ్యానం తో ఒత్తిడిని జయించండి.
భర్తృహరి సుభాషితం
ఆరంభింపరు నీచ మానవులు
విఘ్నాయత్త సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజించుదురు
విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్
ద్రుత్యన్నోతోత్సాహులై
ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ...
ప్రజ్ఞానితుల్ గావునన్
ధైర్యం, ఓర్పు, కోరికలను అణచివేయడం, నిజాయతీగా ఉండటం, సదాచారం, ఇంద్రియాల కట్టడి, బుద్ధి బలం, విద్వత్తు, సత్యం, అతి ఉద్రేకం లేకుండా ఉండటం ..... ఇవన్ని ధర్మపరుని జీవన ముల్యాలు.
నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కాని అది నన్ను ఆకర్షించదు.
అధర్మం అంటే ఏమిటో తెలుసు, నేను దానిని విడవ లేకపోతున్నాను.
.... it still continues untill I have idle time in my life :)
2 comments:
Endi mama telugu ani cheppi paurusham chupinchav kavithalo...
Nice work...
Post a Comment